గద్దర్‌ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ

హైదరాబాద్‌: తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జ్యూరీ కమిటీకి ఛైర్మన్‌గా నటి జయసుధను ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి జ్యూరీ పరిశీలించనుంది. జయసుధ, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌లతో సమావేశమైన ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచించారు. ఎంపిక ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కోరారు.

➡️