అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు పరిధిలో నిర్వహించిన ఎం.టెక్ 3వ సెమిస్టర్, రెగ్యులర్, సప్లిమెంటరీ, బి.ఫార్మసీ 4వ సంవత్సరం 1వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, బి.ఫార్మసీ 4వ సంవత్సరం 1వ సెమిస్టర్, 2వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు డైరెక్టర్ అఫ్ ఎవాల్యుయేషన్ వి.నాగప్రసాద్‌నాయుడు, కంట్రోలర్ అఫ్ ఎగ్సామినేషన్ ఎపి శివకుమార్, అడిషినల్ కంట్రోలర్లు జి.శంకర్‌శేఖర్‌రాజు, ఎం.అంకారావు, ఎస్.శ్రీధర్ తెలిపారు. పరీక్ష ఫలితాల కోసం జెఎన్‌టియు వెబ్‌సైట్ www.jntuaresults.in ను సంప్రదించాలని కోరారు.