ప్రజాశక్తి-పాలకొల్లు : రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. ఓవైపు పవన్ కళ్యాణ్ కు కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరరామ జోగయ్య మద్దతుగా నిలుస్తుండగా, తాజాగా ఆయన కుమారుడు సూర్య ప్రకాశ్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇటీవల తన తండ్రి జోగయ్య సూచనలు పవన్ బేఖాతరు చేయడంతో సూర్యప్రకాశ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయన జనసేన పిసిబి సభ్యులుగా ఉన్నారు.
డా. వైఎస్ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉండగా (వైసిపి పార్టీ స్థాపించక ముందు) సూర్య ప్రకాష్ డిసెంబర్ 21న జగన్ జన్మదినోత్సవం సందర్భంగా పాలకొల్లు మార్కెట్ సెంటర్లో 120 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి, రక్తదాన శిబిరం నిర్వహించారు. అయితే తర్వాత మారిన పరిస్థితుల్లో ఆయన ఇటీవల జనసేనలో చేరారు.
