ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చియ్య చౌదరి సమీప ప్రత్యర్థి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 64,090 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గోరంట్ల 1,29,060 ఓట్లను సాధించగా మంత్రి వేణు 64,970 ఓట్లను మాత్రమే సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్‌కు 2,728 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకూ గోరంట్ల 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఏడు సార్లు విజయం సాధించారు. రాజమహేంద్రవరం సిటీ నుంచి నాలుగు సార్లు, రాజమహేంద్రవరం నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొంది రికార్డు సఅష్టించారు.
