రామోజీరావుకు ప్రగాఢ సంతాపం తెలిపిన జర్నలిస్టు సంఘాలు

విజయవాడ : తెలుగునాట ప్రింట్‌, బ్రాడ్‌ కాస్ట్‌ మీడియాలకు సంబంధించిన ఈనాడు, ఈటీవీతోపాటు అనేక వాణిజ్య సంస్థలను సృష్టించి, కొత్త పుంతలు తొక్కించిన చెరుకూరి రామోజీరావు మృతి పట్ల నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ ( ఎన్‌ఏజే ) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్కే పాండే, ఎన్‌ కొండయ్య ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఏపిడబ్ల్యూజేఎఫ్‌) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌ వెంకట్రావు, జి.ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్‌ బ్రాడ్‌ కాస్ట్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (ఏపీ బీజేఏ) కన్వీనర్లు వి శ్రీనివాసరావు, కే మునిరాజు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మీడియాలో కొత్త ఒరవడి సఅష్టించి సాహితీ రంగానికి ఎనలేని సేవ చేసిన రామోజీరావు మరణం విచారకరమన్నారు. తెలుగు భాషకు రామోజీరావు అమోఘమైన సేవ చేశారని చెప్పారు. వాడుక భాషను వినియోగంలోకి తీసుకురావడంలో కీలక భూమి పోషించడం ద్వారా ఆ పత్రికలను పాఠకులకు చేరువచేసి పెద్ద సంఖ్యలో పాఠకులను తయారు చేసిన ఘనత రామోజీరావుదేనన్నారు. ఎన్‌ఏజే, ఏపీడబ్ల్యూజేఎఫ్‌, ఏపీ బీజేఏలు రామోజీరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాయి.

➡️