విద్యాసాగర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

ప్రజాశక్తి-అమరావతి : సినీనటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు పెట్టిన కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ వ్యాపారవేత్త కె విద్యాసాగర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ఈ నెల 9న తీర్పు చెబుతామని జస్టిస్‌ విఆర్‌కె కృపాసాగర్‌ బుధవారం ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి కుట్రపూరితంగా జత్వానీని తప్పుడు కేసులో ఇరికించారని పిపి వాదించారు. ఇందుకు ఆధారాలు ఉన్నాయన్నారు. కేసు నమోదుకు ముందే జత్వానీని అరెస్ట్‌ చేసే నిమిత్తం ముంబైకు వెళ్లేందుకు పోలీసులు విమాన టికెట్లు కొన్నారన్నారు. ఈ కేసులో పోలీసులు నిజాలు బయటకు రానీయడం లేదని విద్యాసాగర్‌ తరపున న్యాయవాది తెలిపారు.

➡️