ప్రజాశక్తి – బండి ఆత్మ కూర్ : నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల కేంద్రంలో జూనియర్ ఇంటర్ విద్యార్థి చిన్న మస్తాన్(16) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బండి ఆత్మకూరు జూనియర్ కళాశాలలో మస్తాన్ చదువుతున్నాడని, మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
