– కడపలో దేవర సినిమా చూస్తుండగా గుండెపోటు
– గుడ్లవల్లేరులో ఎన్‌టిఆర్, పవన్ అభిమానుల ఘర్షణ
ప్రజాశక్తి – కడప అర్బన్, గుడ్లవల్లేరు : దేవర చిత్రం చూస్తు కడపలో ఓ అభిమాని మరణించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎన్‌టిఆర్, పవన్ కల్యాణ్ అభిమానులు ఘర్షణకు దిగారు. కడప అప్పర థియేటర్‌లో బెనిఫిట్ షో చూస్తూ ఒక్కసారిగా అభిమాని కుప్పకూలిపోయారు. తోటి అభిమానులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు వైఎస్‌ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్‌వలిగా గుర్తించారు. అలాగే టికెట్లు లేని వారు రాజా థియేటర్‌లోకి ప్రవేశించడంతో యాజమాన్యం అడ్డుచెప్పింది. దీంతో వారిపై అభిమానులు దాడికి దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సినిమా టికెటు లేని వారిని బయటకు పంపించివేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని రామకృష్ణ థియేటర్‌లో బెనిఫిట్ షో చూడడానికి మచిలీపట్నం నుంచి ఎన్‌టిఆర్ అభిమానులు దేవర సినిమా పాటలతో థియేటర్ వద్ద హంగామా చేశారు. దీంతో కొంతమంది పవన్‌కల్యాణ్ అభిమానులు ఆయన పాటలు పెట్టారు. ఈ క్రమంలో ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
