ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీ అలుపెరుగని కృషి : జస్టిస్‌ ఎన్‌వీ రమణ

Jun 8,2024 12:58 #Justice NV Ramana, #nivali

హైదరాబాద్‌ : ఈనాడు, ఉషాకిరణ్‌ సంస్థల అధిపతి రామోజీరావు మృతి పట్ల భారత ప్రధాన మాజీ న్యాయమూర్తి , జస్టిస్‌ ఎన్‌వీ రమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు ప్రజాస్వామ్య పరి రక్షణ కోసం, ప్రజల కోసం అలుపెరుగని యోధుడిలా పనిచేసిన పోరాట యోధుడని కొనియాడారు.నేడు ప్రజాస్వామ్య విజయాన్ని చూసి, ఆనందించి, స్వర్గస్తులయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రజా జీవితంలో రామోజీ వ్యవస్థలు భాగస్వామ్యమయ్యాయని వెల్లడించారు. ఆయన మరణం విచారకరమని అన్నారు.

➡️