JVV: అసమానతలు తొలగితేనే సమగ్రాభివృద్ధి

జెవివి వార్షిక మహాసభలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : ప్రాంతీయ అసమానతలు తొలగితేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు పేర్కొన్నారు. అనంతపురంలోని జిఆర్‌ ఫంక్షన్‌ హాలులో రెండు రోజులపాటు జరిగిన జెవివి వార్షిక రాష్ట్ర మహాసభ ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి-కొన్ని పరిశీలనలు’ అనే అంశంపై సదస్సు జరిగింది. జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు హాజరై ప్రసంగించారు. ప్రభుత్వాల లెక్కల ప్రకారం అభివృద్ధి అంటే జిడిపి, తలసరి ఆదాయం వంటి ఆర్థికపరమైన అంశాలేనని తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి లభించినప్పుడే నిజమైన అభివృద్ధి అవుతుందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది అసమగ్ర అభివృద్ధి అని పేర్కొన్నారు. ఎపి అంటే అమరావతి, పోలవరం అని మాత్రమే మిగతా 2లో
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెబుతున్నారని, ఇవి కాదని… రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం వెనుకబడి ఉన్నాయని గుర్తు చేశారు. అభివృద్ధి చెందాయని చెప్పుకునే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ అసమానతలను తొలగించి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జెవివి రాష్ట్ర నాయకులు డాక్టర్‌ వి.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ సమాజంలోని అశాస్త్రీయ భావాలను తొలగించేందుకు సైన్స్‌ ప్రచారాన్ని విస్తృతం ప్రచారం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అశాస్త్రీయ భావాల ప్రభావం యువతపై ఇప్పుడు ఎక్కువగా ఉంటోందన్నారు. దీనిని అధిగమించేందుకు జెవివి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యులు అవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, జెవివి రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ గేయానంద్‌; ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు, ప్రముఖ కార్డియాలజిస్టు వంశీకృష్ణ, జెవివి జిల్లా అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి లకీëనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు
మాయలు మంత్రాలు కాదు… బాబాలు, ఇతరుల పేర్లతో చేసేవన్నీ ట్రిక్స్‌ మాత్రమేనని చాటిచెప్పే విధంగా జన విజ్ఞాన వేదిక సభ్యులు ఆరవేటి ప్రసాద్‌ కొన్ని ప్రదర్శనలు చేసి చూపించారు. నోటిలో మంటలు వెలిగించుకోవడం, కడుపులో కత్తులు పెట్టుకోవడం, గాజు పెంకులపై నడవడం వంటివి చేశారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌, సమతా కన్వీనర్‌ డాక్టర్‌ ప్రసూన కూడా గాజు పెంకులపై నడిచి చూపించారు.

రెండు రోజులపాటు సుదీర్ఘ చర్చలు
జన విజ్ఞాన వేదిక మహాసభ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన జెవివి నాయకులు, కార్యకర్తలు రెండు రోజుల పాటు సుదీర్థ చర్చలు జరిపారు. గత రెండేళ్ల కాలంలో చేపట్టిన కార్యక్రమాలను ఆయా ప్రాంతాల వారీగా వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి చేయాల్సిన పనులపై చర్చించారు. ప్రధానంగా యువతలో శాస్త్రీయ భావాల పెంపుదలకు కృషి చేయడంపై దృష్టి సారించాలని తీర్మానించారు. ఇందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించారు.

➡️