నాపై కేసులను కొట్టేయండి : కాకాణి

ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు, వేదాయపాలెం, కావలి వన్‌టౌన్‌ పిఎస్‌లలో నమోదైన కేసులను కొట్టేయాలంటూ వైసిపి నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో స్టే ఇవ్వాలని కోరారు. కావలి, బోగోలు మండలం, కోళ్లదిన్నెలో టిడిపి నేతలు, వైసిపి నేతల మధ్య ఘర్షణ జరిగింది. కావలి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కాకాణి వెళ్లిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి నేతలను విడిచిపెట్టేది లేదని చెప్పడంపై కోళ్లదిన్నె టిడిపి నేత వంటేరు ప్రసన్న కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా నమోదైన కేసుల్ని కొట్టేయాలని కాకాణి పిటిషన్‌ దాఖలు చేశారు.

➡️