వచ్చే నెలలో కీర్తి సురేష్‌ పెళ్లి

Nov 29,2024 17:40 #Clarity, #Keerthy suresh, #on marriage

ప్రజాశక్తి-తిరుమల : కీర్తిసురేష్‌ పెళ్లి సమయం దగ్గరపడింది. వచ్చే నెలలోనే ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. శుక్రవారం కీర్తిసురేష్‌ తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెళ్లి విషయం బయటపెట్టారు. వచ్చే నెలలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. గోవాలో వెడ్డింగ్‌ జరుగుతుందన్నారు. కీర్తిసురేశ్‌ ఇటీవల తన స్నేహితుడు ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు.

➡️