- సమాచారశాఖ మంత్రి పార్థసారధి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాబోయే కాలంలో ఎఐ, ఐటి, క్వాంటమ్ కంప్యూటింగ్‌లకు కేరాఫ్ అమరావతిగా మారనుందని, ప్రపంచంలో అమరావతి నెంబర్‌వన్ సిటీగా అవతరించనుందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. విజయవాడ బందరు రోడ్డులోని ఆయన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. అమరావతి పున:ప్రారంభోత్సవ సభలో ప్రధాని రూ.58 వేలకోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ప్రధాని, సిఎం, డిప్యూటీ సిఎం తమ అనుభవంతో గాడిలో పెట్టారని ఆయన తెలిపారు.