హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తుపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామన్న సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది.హైకోర్టుగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని సీబీఐ కౌంటర్‌లో పేర్కొంది. దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలన్న సీబీఐ.. అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్స్‌పెక్టర్లు,4 ఎస్సైలతో పాటు సిబ్బంది కావాలని కోరింది. దీనిపై ఫిబ్రవరి 2న మరోసారి హైకోర్టు విచారణ చేయనుంది.
