కడపలో వ్యక్తి కిడ్నాప్‌.. బంగారం లాక్కెళ్లిన దుండగులు..!

Mar 9,2024 12:33 #AP police, #Case, #Kadapa, #kidnap

ప్రజాశక్తి-కడప సిటీ : కడప రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం ఓ వ్యక్తి కిడ్నాప్‌నకు గురయ్యాడు. బాధితుని బంధువులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాపర్లు అతడిని వదిలేశారు. టూటౌన్‌ సిఐ ఇబ్రహీం మాట్లాడుతూ.. ఖలీల్‌ నగర్‌కు చెందిన ఇలియజ్‌ కిడ్నాప్‌ అయ్యారంటూ తల్లి ఫిర్యాదు చేసింది.. సిబ్బందితో వెళ్లి దర్యాప్తు చేపట్టాం.. నకాశ్‌లో ఉండగా అతన్ని స్టేషన్‌కు తీసుకుని వచ్చాం. ఇలియజ్‌ జీవనోపాధి కోసం దుబారుకి వెళ్లాడు. అక్కడ సంపాదించిన డబ్బుతో కొంత బంగారం తీసుకొని ఇవాళ ఉదయం కడపకు వచ్చాడు. అదే ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇలియాజును అడ్డుకుని ఆటోలో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని.. అతడిపై దాడి చేసి బంగారాన్ని లాక్కున్నారని తెలిపాడు. అతని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనపై బాధితుడు ఇలియాజ్‌ మాట్లాడుతూ.. ఆటోలో వచ్చిన దుండగులు ఒక్కసారిగా దాడి చేసి.. ఆటోలో కొట్టుకుంటూ తీసుకువెళ్లారని.. దుబారు నుండి తన కష్టార్జితంతో తెచ్చుకున్న బంగారాన్ని బెదిరించి లాక్కోని వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన పేరుతో బంగారు కొనుగోలు చేసిన బిల్లులు సైతం ఉన్నాయని.. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

➡️