అశ్రు నయనాలతో కిల్లో శరభన్న అంతిమయాత్ర 

ప్రజాశక్తి-పెదబయలు: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం సిపిఎం సీనియర్ నాయకుడు కిల్లో శరభన్న అనారోగ్యంతో బాధపడుతూ కె.జి.హెచ్.లో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. పెదబయలు మండలం వారి స్వగ్రామం వడ్డెపుట్టు గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు మాట్లాడుతూ.. కిల్లో శరభన్న సుదీర్ఘకాలంగా సిపిఎంలో ఉంటూ  ప్రజా ఉద్యమంలో పనిచేస్తూ గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై నిత్యం పని చేస్తూ, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. కార్మిక సమస్యలపై అండగా నిలబడ్డారన్నారు. పివీటిజి అంత్యోదయ రేషన్ కార్డులు, త్రాగునీరు, రోడ్డు, జన్ మాన్ హౌసింగ్ అనేక సమస్యలపై పని చేసి ప్రజల మన్ననలు పొందారు. అటువంటి నాయకుడు మన మధ్య లేకపోవడం వారి కుటుంబానికి ప్రజలకు, సిపిఎంకి తీరాన్ని లోటు అని తెలిపారు. అంత్యక్రియల కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాచిపెంట అప్పలనర్స, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొండ.సన్నిబాబు, పాలికి లక్కు, సొంటెని హైమవతి , పాంగి కుమారి, వంతల దాసు, హుకుంపేట వైస్ ఎంపిపి సుడిపల్లి కొండలరావు, ముంచంగిపుట్టు వైస్ ఎంపిపి సత్యనారాయణ, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు.బాలదేవ్ రాందాస్, ఎమ్.ఎమ్.శ్రీను, బుజ్జిబాబు, సునీల్ , భీమరాజు, పెదబయలు మాజీ ఎంపిపి జర్సింగి.సూర్యనారాయణ, వి.అప్పారావు మాజీ వైస్ ఎంపిపి కె.నర్సయ్య, వి.కొండలరావు, మాజి ఎంపిటిసి గ్రామస్తులు రాజు, రామారావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

➡️