ఆదిత్యునికి కిరణ స్సర్శ

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదిత్యుని మూలవిరాట్టును సూర్యకిరణాలు మంగళవారం తాకాయి. మూడు నిమిషాల పైబడి పాదాల నుంచి శిరస్సు వరకు భానుని కిరణాలు స్పృశించాయి. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు యాత్రికులు ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వేకువజామున నాలుగు గంటల నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ఆకాశంలో మబ్బుల్లేకపోవడంతో ఉదయం 6.20 గంటల సమయంలో బంగారు రంగులో లేలేత కిరణాలు స్వామి మూలవిరాట్టుపై ప్రకాశించడాన్ని కళ్లార్పకుండా చూశారు. ఆలయ గోపురం నుంచి గర్భగుడిలోని స్వామివారి మూలవిరాట్టుకు మధ్య 350 అడుగుల దూరం ఉంటుంది. ఆలయ ప్రాకారాలు, మండపం, ధ్వజస్తంభాన్ని దాటుకొని సూర్య కిరణాలు స్వామి వారి విగ్రహాన్ని తాకాయి. ఏటా దక్షిణాయనం, ఉత్తరాయణం మార్పుల్లో భాగంగా అక్టోబరు 1, 2 మార్చి 9, 10 తేదీల్లో ఆదిత్యున్ని సూర్యకిరణాలు స్పర్శిస్తుంటాయి.

➡️