వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని కాపాడుకుంటాం: కొడాలి నాని

Jun 8,2024 14:45 #kodali nani, #press meet

గుడివాడ: ఏపీలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. కళ్లేదుటే దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ మరో బిహార్‌గా మారుతోందంటూ ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపైనా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. న్యాయపరంగా కోర్టులోనే తేల్చుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు నిర్ణయించారు.
టీడీపీ దాడులపై మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు తమపై దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల, కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారు. దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదు” అని కొడాలి నాని ధ్వజమెత్తారు.
వైఎస్సార్‌సీపీపై జరుగుతున్న దాడుల పై హైకోర్టుకు వెళ్తాం. దాడులు చేసిన వారితో పాటు. చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు వేస్తాం. రాబోయే రెండు రోజుల్లో కఅష్ణాజిల్లాలో పర్యటిస్తాం. గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతాం. కార్యకర్తలను కాపాడుకుంటాం. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తాం. శాంతిభద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని కొడాలి నాని చెప్పారు.

➡️