ప్రజాశక్తి-ఒంటిమిట్ట : శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యాత్రికులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించారు. భజన బృందాలు, చెక్కభజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఇఒ సిహెచ్.వెంకయ్య చౌదరి, జెఇఒ వి.వీరబ్రహ్మం, డిప్యూటీ ఇఒ నటేష్ బాబు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఇంజినీరింగ్ అధికారులు, పెద్ద సంఖ్యలోయాత్రికులు పాల్గొన్నారు.
