ఆసిఫాబాద్‌ మెడికల్‌ కాలేజీకి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెడుతున్నాం : సిఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ : ఆసిఫాబాద్‌ మెడికల్‌ కాలేజీకి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెడుతున్నామని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ … తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. ఆయన చనిపోతే మాజీ సిఎం కనీసం చూడటానికి కూడా రాలేదని విమర్శించారు. టెక్స్‌టైల్‌ వర్సిటీ ఏర్పాటు చేసిన దానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టామని గుర్తు చేశారు. ఆసిఫాబాద్‌ మెడికల్‌ కాలేజీకి కూడా ఆయన పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. పద్మశాలిలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.

➡️