హైదరబాద్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనీ నటుడు నాగార్జున, నాగచైతన్యపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారన్నారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకొంటే.. మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే సీనీ నటుడు నాగార్జున, నాగచైతన్య, సమంత, రకుల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. టాలీవుడ్‌ను షాక్‌కు గురి చేస్తున్నాయి.