తెలంగాణ : కొద్దిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నా అంటూ …. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ శనివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను వెల్‌నెస్ కోసం కొద్దిరోజుల పాటు రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నానని, అయితే ఈ బ్రేక్‌తో తన రాజకీయ ప్రత్యర్థులు తనను అంతగా మిస్సవరని ఆశిస్తున్నట్లు పోస్టులో పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వీక్షకులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.