అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేశాం : కేటీఆర్‌

Apr 27,2024 12:37 #hyderabad, #minister ktr, #Telangana

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శనివారం ఉదయం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని కేసీఆర్‌ ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ పుట్టుక ఒక సంచలనం అన్నారు. యెన్నో పోరాటాలతో లక్ష్యంతో తెలంగాణ సిద్ధించిందన్నారు. కేసీఆర్‌ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే రాష్ట్రం సాకారం అయిందన్నారు. పదేళ్ల పాటు తమకు ప్రజలు అధికారం ఇచ్చారు.. దానిని తాము సద్వినియోగం చేశామని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేశామని వెల్లడించారు.

➡️