KTR – రాష్ట్రంలో దందా నడుస్తోంది : కెటిఆర్‌

Oct 28,2024 11:09 #danda, #in the state, #KTR, #post, #running

తెలంగాణ : ప్రస్తుతం రాష్ట్రంలో ‘దొరికినకాడికి దోచుకో – అందినంత దండుకో’ దందా నడుస్తోందని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో కెటిఆర్‌ పోస్టు చేశారు. అక్రమార్కులు, కాంగ్రెస్‌ గ్యాంగ్‌లు చెట్టాపట్టాలేసుకొని సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. చీకటి వాటాలు, సీక్రెట్‌ ఒప్పందాలు చేసుకొని యథేచ్ఛగా ఇసుక, మట్టిని బుక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా పాలనలో దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇసుకాసుర.. బకాసుర.. భస్మాసుర రాజ్యం ఇది అని పోస్టులో పేర్కొన్నారు. హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌లో సొంతింటి కలలు కలగానే మిగిలిపోతున్నాయని, కాసులపై కక్కుర్తి నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నాయని కెటిఆర్‌ మండిపడ్డారు.

➡️