హైకోర్టులో కేటీఆర్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ విచారణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ … హైకోర్టులో కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 6 న కేటీఆర్‌ను ఏసీబీ విచారించాల్సి ఉంది… కానీ.. తన న్యాయవాదిని అనుమతించకపోవడంతో హాజరుకాలేనంటూ.. ఆయన ఏసీబీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లడంతో విచారణ జరగలేదు. దీంతో ఏసీబీ అధికారులు అదేరోజు ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న (గురువారం) విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

➡️