తెలంగాణ : ‘ కనకపు సింహాసనమున..’ అంటూ … సుమతీ శతక పద్య ప్రస్తావనతో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. పెద్దలు ఎప్పుడో చెప్పారంటూ పద్యానికి ఆయన చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కెటిఆర్ టార్గెట్ చేశారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే, కెటిఆర్ తన పోస్ట్‌లో ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. కెసిఆర్ కొనఊపిరితో ఉన్నారంటూ సిఎం రేవంత్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కెసిఆర్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో నిన్న నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్‌లో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ‘ఆట మొదలైంది కాస్కో’ అంటూ కెసిఆర్‌ను ఈ సందర్భంగా హెచ్చరించారు. బిఆర్‌ఎస్ పార్టీని గత ఎన్నికల్లో ఓడించామని, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను సరిహద్దుల నుంచి తరిమేద్దామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు 👇 pic.twitter.com/G1Xl7AEeHt
— KTR (@KTRBRS) January 26, 2024