ముగిసిన కూచిపూడి పతాక స్వర్ణోత్సవ వేడుకలు

ప్రజాశక్తి-చల్లపల్లి : కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవ వేడకలు ఆదివారం ముగిశాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ సిదేంద్ర యోగి, కూచిపూడి కళాపీఠం, కూచిపూడి హెరిటేజ్‌ ఆర్ట్స్‌ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్‌, కొల్లు రవీంద్ర, ఉప సభాపతి రఝరామకష్ణంరాజు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ కూచిపూడి నృత్యం అజరామంగా విరాజిల్లే విధంగా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. మత్స్యశాఖ, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని శాఖల సమన్వయంతో భావితరాలకు కూచిపూడి నృత్యాన్ని చేరువ చేసేందుకు కృషి చేస్తామన్నారు.ఈ సందర్భంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.

➡️