KVPS: 218జీవోని రద్దు చేసి, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలి

Jan 1,2025 13:57 #check posts, #jobs, #KVPS, #sc st

కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్

ప్రజాశక్తి-విజయవాడ: 2016లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో నెం 218ని రద్దు చేసి ఎస్ సి, ఎస్ టి బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి ప్రకటనను విడుదల చేశారు. దళిత, గిరిజనులు కొరకు తామున్నామని చెబుతున్న చంద్రబాబు 2016 కొత్త సంవత్సరం రోజున టిడిపి ప్రభుత్వ హాయాంలో ఎస్ సి, ఎస్ టి బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా సంవత్సరం పొడిగిస్తూ జీవో నెం 218 ఇచ్చారని తెలిపారు. తరువాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పద్ధతి కొనసాగించి బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయలేదని అన్నారు. తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం జీవో రద్దు చేసి బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ జీవోను అడ్డుపెట్టుకొని గత అనేక సంవత్సరాల నుండి అధికారులు భర్తీ చెయ్యకుండా ఉండటం ద్వారా బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందరికో ఆర్హత ఉన్నా కూడా వయస్సు పెరగటం వల్ల ఉద్యోగాలు అవకాశాలు కోల్పోతున్నామని ఆభ్రతాభావంలో దళితులు, గిరిజనులు ఉన్నారని అన్నారు. దీనికి కారణం పాలకుల విధానమే అని తెలిపారు. పాలకులు ప్రతిసారి మోసం చేస్తున్నారు. ఎస్ సి, ఎస్ టిల పట్ల  చిత్తశుద్ధి ఉంటే జీవో -218ని రద్దు చేసి బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన చెయ్యాలిసి వస్తుందని హెచ్చరించారు.

➡️