ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో దళితులకు అన్యాయం జరిగిందని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్‌సి కమిషన్‌కు గతంలో రూ.70.79 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది కేవలం రూ.41 కోట్లు కేటాయించారని తెలిపారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ మేరకు సబ్‌ప్లాన్ చట్టం ఏర్పాటుకు పదేళ్ల నుంచి అధికారంలో ఉండి కూడా అమలు చేయకపోవడం దారుణమన్నారు.
