- మేడే శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ కష్టంతో ప్రగతిపూర్వక సమాజ నిర్మాణానికి చేయూతనిచ్చే శ్రామికుల హక్కులను కాపాడటంలో టిడిపి ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. మే డే సందర్భంగా కార్మికలోకానికి శుభాకాంక్షలు చెబుతూ బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని ఆయన పేర్కొన్నారు. తాము విడుదల చేసిన మ్యానిఫెస్టోలో కూడా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు.