తిరుపతి పద్మావతి వర్సిటీ వద్ద ఉద్రిక్తత… నిరసనకారులపై లాఠీచార్జి

May 14,2024 18:12 #attack, #police, #TDP

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఈ సాయంత్రం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు పద్మావతి వర్సిటీ రోడ్డుపై బైఠాయించి.. పులివర్తి నాని అనుచరులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో, పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులపై లాఠీచార్జి చేసి, వారిని అక్కడ్నించి చెదరగొట్టారు. తొలుత సాధారణ పోలీసులు రాగా, వారితో టీడీపీ నేతలకు వాగ్వాదం జరిగింది. తమకు న్యాయం చేయాలని టీడీపీ కార్యకర్తలు కోరారు. ఈ దశలో ప్రత్యేక బలగాలు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలపై లాఠీ చేశారు.

➡️