షర్మిలకు వామపక్షాల సంఘీభావం

Feb 22,2024 11:54 #CPIM, #Protest, #ys sharmila

అమరావతి : మెగా డిఎస్‌సి ప్రకటించాలంటూ … ఎపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల గురువారం ఉదయం ఆంధ్రరత్న భవన్‌ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు వామపక్షాలు సంఘీభావం తెలిపాయి. షర్మిలకు సంఘీభావంగా పీసీసీ కార్యాలయానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేరుకున్నారు. ఆమెతోపాటు బైఠాయించి నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిసిసి కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయానికి వెళ్లే అన్ని రహదారుల వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి రాకపోకలు నిలిపేశారు.

➡️