టీమ్‌ ఇండియాకు శాసనసభ శుభాకాంక్షలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోపిలో విజేతగా నిలిచిన టీమ్‌ ఇండియాను రాష్ట్ర శాసనసభ అభినందించింది. సోమవారం ఉదయం ప్రారంభమైన సభలో స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు. మూడోవసారి ఈ ట్రోపిని భారత జట్టు గెలుపొందిందని ఆయన చెప్పారు. జట్టు కెప్టెన్‌కు, సభ్యులకు శాసన సభ, సభ్యులు, రాష్ట్ర ప్రజల తరుపున అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

➡️