ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను నివారిద్దాం

Mar 15,2025 20:26 #Swachh Andhra, #Tirupati district

ప్లాస్టిక్ మరియు ఇతర ఉత్పత్తులను చెత్తగా వేయకుండా ఉండడం

పునర్వినియోగించదగిన తగిన వస్తువులను ప్రోత్సహించండం

ఆర్ ఆర్ ఆర్ పద్ధతిని అనుసరించండి: వక్తలు

ప్రజాశక్తి – క్యాంపస్ : ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మూడవ శనివారం నిర్వహించు “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమము నందు ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను నివారించండం, ప్లాస్టిక్ మరియు ఇతర ఉత్పత్తులను చెత్తగా వేయకుండా ఉండడం, పునర్వినియోగించదగిన తగిన వస్తువులను ప్రోత్సహించండం వంటి మూడు అంశాల ప్రచారంలో భాగంగా మార్చి 15 ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఎస్వీయూ – ఎన్ఎస్ఎస్, ఎన్ సిసి వాలంటీర్లు, మహిళ విశ్వవిద్యాలయ విద్యార్థినిలు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ టూరిజం సంయుక్త ఆధ్వర్యంలో దాదాపు 1000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ కార్యదర్శి, తిరుపతి జిల్లా పరిశీలక అధికారి కోన శశిధర్ విద్యార్థులను ఉద్వేషించి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజంగా మార్చుటకు విద్యార్థులు ప్లాస్టిక్ రహిత ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ మాట్లాడుతూ “రెడ్యూస్ – రీ యూస్ – రీ సైకిల్” అనే ట్రిపుల్ ఆర్ విధానాన్ని సమాజం అవలంబించాలని కోరారు. మహిళా వర్సిటీ విసి ఆచార్య ఉమా మాట్లాడుతూ ప్లాస్టిక్ సమాజంలో విధ్వంసం సృష్టిస్తుందని, ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా నిషేధించేందుకు ప్రతిని పూనాలని అన్నారు. ఎస్వియూ ఇంచార్జీ ఉపకులపతి ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రధాన రగ్మత అయిన క్యాన్సర్ కారకంగా ప్లాస్టిక్ వాడకమే అనీ, సమాజం వీలైనంతవరకు ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలని తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ లో తిరుపతి మూడు లక్షలు ఆపై జనాభా కలిగిన న్యూఢిల్లీ లాంటి పట్టణాలతో పోటీలో ఉందని, సర్వేలో విద్యార్థులు పాల్గొని తిరుపతికి ప్రథమ స్థానం వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నర్సింహ యాదవ్ మాట్లాడుతూ సమాజంలోని వ్యక్తులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ను నిషేధించుకోవాలని ఆయన కోరారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తన వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డా పాకనాటి హరికృష్ణ, డా. మునిలక్ష్మి, డా మునీంద్రా, టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, మహిళా వర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్ సి సి క్యాడేట్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️