‘యువత పోరు’తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం

Doubts-on-Chandrababu%27s-medical-report-Sajjala
  • వైసిపి కోఆర్డినేటర్‌ సజ్జల

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : యువత పోరు పేరుతో నిర్వహించే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని వైసిపి రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 12వ తేదీన నిర్వహించేఈ కార్యక్రమంపై సోమవారం ఉదయం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ, విద్యార్థి, యువజన విభాగం నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 13 యూనివర్శిటీల నుండి విద్యార్థి నాయకులు, విద్యారంగ ప్రముఖులు పాల్గొన్నఈ కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాడాలని అన్నారు. దీనిలో భాగంగా మంగళవారం అన్ని యూనివర్శిటీల లోపలగానీ, బయటగానీ పోస్టర్‌ను ఆవిష్కరణ, 12న ర్యాలీలు చేపట్టాలని సూచించారు. నిరుద్యోగులను, యువతను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ వైఖరిని నిలదీయడమే ప్రధాన అంశంగా ఉండాలని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైసిపి శ్రేణులు కలెక్టర్లకు వినతిత్రాలు సమర్పించాలని తెలిపారు. ఎక్కువమంది విద్యార్థులు హజరయ్యేలా చూడాలని తెలిపారు. వైసిపి ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ యువత పోరు కార్యక్రమం కూటమి ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపాలని అన్నారు. దీనికి ఇబ్బందులు ఎదురైతే రాష్ట్రస్థాయి నాయకత్వం సహాయ సహకారాలు తీసుకోవాలని విద్యార్థి, యువజన విభాగాల నాయకులకు సూచించారు.

➡️