- ‘హత్య’ సినిమాపై ఎస్‌పికి ఫిర్యాదు : సునీల్‌యాదవ్
ప్రజాశక్తి- పులివెందుల టౌన్, కడప ప్రతినిధి : ‘హత్య’ సినిమాలోను తన గురించి, తన తల్లి గురించి వక్రీకరించి తీశారని, వైసిపి పెద్దల నుంచి తనకు ప్రాణహాని ఉందని కడప జిల్లా ఎస్‌పి అశోక్ కుమార్‌కు మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేశారు. బుధవారం జిల్లా ఎస్‌పి కార్యాలయంలో ఆయనను కలిశారు. ‘హత్య’ సినిమాలో వివేకాను చంపినది నలుగురు అని చూపించారని, నా తల్లి గురించి అసభ్యంగా చిత్రీకరించారని, వైసిపి పెద్దల నుంచి నాకు ప్రాణహాని ఉంది అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి చెందిన వారే ఈ సినిమా తీశారని, ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని ఎస్‌పిని కోరానని తెలిపారు. జైల్లో ఉన్నప్పుడు బెదిరించిన వారి పేర్లను ఎస్‌పికి ఇచ్చానని చెప్పారు.