నేడు, రేపు తేలికపాటి వర్షాలు

Jun 11,2024 08:33 #andrapradesh, #rains, #Weather Alert
  • విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మరఠ్వాడా ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11న అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. 12న నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

➡️