న్యూ ఢిల్లీ : లిక్కర్‌స్కామ్ కేసుకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ పై శుక్రవారం ఢిల్లీ కోర్టులో చేపట్టిన విచారణకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా లిక్కర్ కేసు నిందితులంతా వర్చువల్‌లో హాజరయ్యారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేజినేషన్ సరిగ్గా లేదని నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 14 లోపు ఛార్జ్‌షీట్‌లో సరిగ్గా పేజినేషన్ చేస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. అనంతరం ఈ కేసును ఆగస్టు 21 కి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి కావేరి బవేజా వెల్లడించారు.
