కావలిలో వార్డు సచివాలయంలోనే మద్యం నిల్వలు

Apr 21,2024 16:15 #Liquor is stored, #ward office

కావలి: క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాలు అక్రమాలకు నిలయంగా మారాయి. ఇన్నాళ్లు అధికార వైసిపికు జాగీరుగా ఉన్న ఈ సచివాలయ వ్యవస్థ నేడు ఎన్నికల నియమావళిని సైతం కాలదన్ని మద్యం నిల్వ చేసే స్థావరాలుగా మారుతున్నాయి. ఆదివారం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఈ వ్యవహారంపై దుమారం రేగింది. పురపాలక సంఘ పరిధిలోని బుడంగుంట వార్డు సచివాలయంలో 43 మద్యం సీసాలను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి మెంతెం శ్రీనివాసులురెడ్డి పట్టుకున్నారు. అదే ప్రాంగణంలోని మరో గదిలో నిల్వ చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కావలి గ్రామీణ సిఐ శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పురపాలక కమిషనర్‌ శ్రావణ్‌ కుమార్‌ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

➡️