నేడు హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్‌

Apr 17,2024 08:28 #closed, #hyderabad, #Liquor shops, #today

తెలంగాణ : శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా… మద్యం విక్రయాలపై పోలీసులు నిషేధం విధించారు. బుధవారం ఉదయం ఉదయం 6 గంటల నుంచి రేపు ( గురువారం ) ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను బంద్‌ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు. షాపుల యజమానులు ఈ విషయాన్ని గమనించి మద్యం విక్రయాలను క్లోజ్‌ చేయాలని తెలిపారు. ఎక్కడైనా మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం అందితే ఆ షాపు యజమానులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

➡️