ఉదయం 8 గంటలకే లాటరీ విధానం ప్రారంభం
వేలాదిగా తరలివచ్చిన దరఖాస్తుదారులు
ప్రజాశక్తి-యంత్రాంగం : మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. జిల్లాలో ఎంపిక చేసిన ప్రత్యేక కేంద్రంలో జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో సోమవారం లాటరీ నిర్వహించారు. ఈ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసుశాఖ గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంది.
నంద్యాల కలెక్టరేట్ : జిల్లాలో 105 మద్యం షాపులకు లాటరీ సిస్టంను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రారంభించారు. లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. ఎలాంటి అవాంఛనీయా సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇప్పటికి నంద్యాల, నందికొట్కూరు డివిజన్ ల మద్యం షాప్ ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది.. ప్రస్తుతం ఆళ్లగడ్డ డివిజన్ లో 44 గజిట్ వరకు లాటరీ ప్రక్రియ పూర్తి అయింది. 48 గజిట్ నడుస్తుంది.
భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పెద్ద అమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ప్రారంభించారు. ఫంక్షన్ హాల్ వద్దకు దరఖాస్తుదారులు పోటెత్తారు. ఉదయం 6 గంటలకే హాలు వద్దకు దరఖాస్తుదారులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం 8 గంటలకు కలెక్టర్ చేతుల మీదగా లాటరీ విధానాన్ని ప్రారంభించడం జరిగింది.నూతన మధ్యం పాలసీ 2024-2026 కు జిల్లాలో భీమవరం స్టేషన్ పరిధిలోని 40 దుఖాణాలకు 1,287 దరఖాస్తులు, తణుకు స్టేషన్ పరిధిలోని 33 దుఖాణాలకు 877 దరఖాస్తులు, తాడేపల్లిగూడెం స్టేషన్ పరిధిలోని 36 దుఖాణాలకు 1,224 దరఖాస్తులు, పాలకొల్లు స్టేషన్ పరిధిలోని 19 దుఖాణాలకు 873 దరఖాస్తులు, నరసాపురం స్టేషన్ పరిధిలోని 24 దుఖాణాలకు 958 దరఖాస్తులు, ఆకివీడు స్టేషన్ పరిధిలోని 23 దుకాణాలకు 408 దరఖాస్తులు చొప్పున జిల్లాలోని మొత్తం 175 షాపులకు 5,627 దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేయడం జరిగింది.దరఖాస్తుదారుడు అప్లికేషన్ ఫారం, ఎంట్రీ లేదా గేట్ పాస్ తీసుకొని హాల్లోకి అనుమతిస్తున్నారు. ఒక వేళ దరఖాస్తుదారుడు హాజరు కానీ పక్షంలో వారి స్థానంలో వేరొకలని హాజరైతే పాటు పాన్ కార్డు ఆధారు కార్డు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్సు ఓటర్ కార్డు రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్ బుక్ కానీ నకలు తీసుకుని అనుమతిస్తున్నారు. వెంట తీసుకురావాలని తెలిపారు. షాప్ కేటాయించబడిన వ్యక్తులు సదరు లైసెన్సు ఫీజులో మొదటి వంతు నగదు రూపేణకానీ లేదా ఆన్లైన్ చెల్లింపు ద్వారా కానీ ఆక్షన్ హాల్ న ఏర్పాటు చేసిన బ్యాంక్ కౌంటర్, చలాన్ రూపంలో చెల్లించే వెసులుబాటును కల్పించడం జరిగింది.
లాటరీ ప్రక్రియను ప్రారంభిస్తున్న జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే…
మద్యం దుకాణాలకు నేడు లాటరీ..
పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో 229 మద్యం దుకాణాలకు సంబంధించి 2638 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. సోమవారం టెండర్ ప్రక్రియ లాటరీ నేపథ్యంలో దరఖాస్తు దారులు ఉదయం 7 గంటలకు బారులు తీరారు.ఎటువంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా భారీగా పోలీసు ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తూ ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఎక్సయిజ్ పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ కె.మణికంఠ ఇతర అధికారులు పాల్గొని లాటరీ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎటువంటి అపోహలకు తావు లేకుండా లాటరీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు
జిల్లాలో ప్రారంభమైన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ
విజయనగరం : మొత్తం 153 షాపులకు 5,242 దరఖాస్తులు దాఖలు. కలెక్టరేట్ ఆడిటోరియంలో లాటరీ ప్రక్రియను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్. సేతు మాధవన్. లాటరీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ డిసి బాబ్జిరావు, సూపరిండెంట్ శ్రీనాథుడు.
లక్కు దక్కేది ఎవరికో. మద్యం దుకాణాలపై ఎదురుచూపులు
రంపచోడవరం నియోజకవర్గంలో రూ 8.24 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం
రాజవొమ్మంగి : రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గంలో మద్యం దుకాణాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు ఎదురుచూస్తున్న నేపథ్యంలో.ఈరోజు లాటరీ ద్వారా దుకాణాలను ప్రభుత్వం కేటాయించనుంది. ఈ తరుణంలో మద్యం కిక్కు లక్కు ఎవరికి తొక్కుతుందో వారు అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. మద్యం దుకాణాలుకోసం, ఆన్లైన్ దరఖాస్తులు ప్రక్రియ ఈనెల 11 అర్ధరాత్రి తో ప్రశాంతంగా ముగిసింది. రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం సర్కిల్లో పదం మద్యం షాపులకు గాను 240 మంది దరఖాస్తులు చేసుకోగా, చింతూరు సర్కిల్ లో 8 మద్యం షాపులకు గాను, 412 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నియోజకవర్గ ద్వారా ప్రభుత్వానికి రూ 8.24 కోట్ల మేర ఆదాయం ఆదాయం చేకూరనుంది.అల్లూరి జిల్లా వ్యాప్తంగా 40 మద్యం దుకాణాలకు గాను, 1205 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా, ఎక్సైజ్ శాఖకు రూ 24.40 కోట్ల మేర ఆదాయం చేకూరనుంది. ఈ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం నేడు అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరులో లక్కీ డ్రా తీయనున్నారు.
ఏలూరు జిల్లా : వట్లూరు మినీ బైపాస్ లోని చలసాని గార్డెన్స్ లో ఏలూరు జిల్లా మద్యం షాపుల కేటాయింపు కార్యక్రమం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో కొంతమంది సకాలంలో రాకపోవడంతో ఇంకా ప్రారంభం కాని డ్రా ప్రక్రియ.