LIVE: బహిరంగ సభ – సిపిఎం ఏపి 27వ రాష్ట్ర మహాసభ

నెల్లూరు : బహిరంగ సభ – సిపిఎం ఏపి 27వ రాష్ట్ర మహాసభ

 

బహిరంగ సభలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ ప్రసంగం

  • కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయింపులు లేవని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ మండిపడ్డారు.
  • అంగన్వాడి, మధ్యాహ్న భోజన, అసంఘటిత కార్మికులకు, స్కీం వర్కర్స్ లకు కూడా అదనంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆగ్రహించారు.
  • సీనియర్ సిటిజన్లకు, వితంతువులకు ఈ బడ్జెట్లో అదనంగా ఒక రూపాయి పెంచలేదని మండిపడ్డారు. ధనికులకు ఒక పైసా కూడా అదనంగా పన్ను పెంపు లేదని ధ్వజమెత్తారు.
  • మోడీ ప్రభుత్వం అదాని, అంబానీ వంటి బడా కార్పొరేట్లను కాపాడడం కోసం ఈ బడ్జెట్ ఉందని మండిపడ్డారు.
  • భారత రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా భక్షించేందుకు ప్రయత్నం చేస్తుందని ఆగ్రహించారు. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తిని ధ్వంసం చేస్తుందని మండిపడ్డారు.
  • ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రూ.60 వేల కోట్ల నిధులను బడ్జెట్లో తగ్గించారని మండిపడ్డారు.
  • ప్రజా వ్యతిరేక బడ్జెట్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఈ మహాసభ సందర్భంగా  ఆమె కేంద్రాన్ని హెచ్చరించారు.
  • సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ప్రజల పట్ల కేంద్ర వివక్షతకు వ్యతిరేకంగా నిరసన తెలిపారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు కోసం డిమాండ్ చేశారా అని ప్రశ్నించారు.  ప్రత్యేక హోదా కోసం, విశాఖ ఉక్కు పరిరక్షణ, రాష్ట్ర హక్కులను కాపాడేందుకు డిమాండ్ చేశారా అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోతున్నది వీటి కోసం కాదని పేర్కొన్నారు.
  • చంద్రబాబు నాయుడు సిగ్గులేని బాబుగా ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తన అవినీతిని కేసులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రానికి మద్దతిస్తున్నారని, ఆర్ఎస్ఎస్, బిజెపికి మద్దతు ఇస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
  • ఆర్ఎస్ఎస్ అంటే దేశాన్ని సర్వనాశనం చేసే సంస్థ అని ఆమె పేర్కొన్నారు. వీరు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యురిజాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడలేరని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం కార్పొరేట్ అనుకూలమైన, మతతత్వంతో కూడుకున్నదని స్పష్టం చేశారు. వీరిది దేశ ఐక్యతను విచ్చిన్నం చేసే భావజాలమని మండిపడ్డారు.

 

బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రసంగం :

  • 2020లో చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద ప్రాజెక్టు వద్దని, చిన్న ప్రాజెక్టులతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారని పేర్కొన్నారు.
  • నీటి పారుదల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
  • కొందరు పని గంటల పెంచాలని చెప్తున్నారని, సిఎం చంద్రబాబు ఎక్కువ మంది పిల్లలను కనాలని అని చెప్పడం మహిళలు హక్కులను హరించడమేనని మండిపడ్డారు. పిల్లలను కనాలా లేదా అన్నది మహిళలు ఇష్టమని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
  • రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ప్రత్యామ్నాయ విధానాలను ప్రకటించిందని వివరించారు. ప్రజల ఆదాయాలను పెరిగి   విధానాలతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
  • చైనా  పోటీ పడాలంటే ప్రజలకు కొనుగోలు శక్తి పెంచాలని అప్పుడే పెట్టుబడులు వస్తాయని అని పేర్కొన్నారు.
  • రాజకీయం అంటే అబద్ధాలు చెప్పడం మోసం చేయడం హత్యలు చేయడం కాదని, రాజకీయం అంటే ప్రజల కొరకు పని చేయడం అని స్పష్టం చేశారు.
  • పోలవరం ప్రాంతాల్లో గిరిజన, ఆదివాసి యువతను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
  • విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, అర్హులైన వాళ్లందరికీ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సమస్యలపై కలిసి వచ్చే అన్ని పార్టీలను, ప్రజాతంత్ర వాదులను కలుపుకొని పోరాడుతామని పేర్కొన్నారు. ఈ పోరాటానికి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరారు.

బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఎ గఫూర్ ప్రసంగం

  • భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా మతవిద్వేషాలను రెచ్చగొడుతూ దేశాన్ని విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని తెలిపారు.
  • కేంద్ర బిజెపి ప్రభుత్వం మధ్య విభజన తీసుకొచ్చి జనాల్ని రెచ్చగొడుతూ తమ స్వార్ధ రాజకీయాలను నడుపుతున్నారని మండిపడ్డారు.
  • అన్యాయంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రచారం చేస్తూ వక్ఫ్ భూముల చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహించారు. మత ఉద్రిక్తతను రెచ్చగొట్టేలా వక్ఫ్ భూముల చట్టాన్ని సవరించారని మండిపడ్డారు.
  • దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించడం అని ఇది బిజెపికి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్య విదేశాలు రెచ్చగొట్టి వారిని కొట్టుకునేలా చేసి దేశాన్ని ప్రేమిస్తామంటే ఎలా నమ్ముతామని మండిపడ్డారు
  • సీఎం చంద్రబాబు నాయుడు ఈ చట్టాన్ని సవరణకు మద్దతు తెలపడం సరైంది కాదని తెలిపారు.
  • చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి నిధులు ఇస్తారని మోడీకి భజన చేస్తున్నారని ఆయన తెలిపారు. కానీ నిధులు కాకుండా అప్పుల రూపంలో ఇచ్చారని, అయినా భజన చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. అప్పు తెచ్చి పప్పు కూడు ఎన్నాళ్ళు సాగిస్తారని ప్రశ్నించారు.
  • విభజన అనంతరం రాష్ట్ర నష్టపోయిందని, దీనికి సంబంధించిన నిధులు కేంద్రం నుంచి రాబట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జరగాల్సింది అభివృద్ధి కేంద్రీకరణ కాదని అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆయన తెలిపారు.
  • రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు.
  • రాష్ట్ర నిధుల కోసం అఖిలపక్షం ఏర్పాటు చేసి నిధుల సాధన కోసం ఏం చేయాలని చర్చిద్దాం అని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ప్రకటన ఆర్భాటాలు తప్ప పనులు చేయడం లేదని మండిపడ్డారు.
  • చంద్రబాబు బిజెపి మతోన్మాద విష కౌగిలి నుంచి బయటపడాలని తెలిపారు.

 

బహిరంగ సభలో పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రసంగం : 

  • గతంలో అధికారంలో ఉండి ఐదేళ్లలో రాజధాని కట్టలేని సిఎం చంద్రబాబు ఇప్పుడు కడతామంటే ఎలా నమ్మాలని బివి రాఘవులు ప్రశ్నించారు.
  • ఈ రాష్ట్రానికి ఎక్కువ సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు అని అన్నారు. 2020 విజినల్ అని చెప్పి ఇప్పుడు 2047 అని చెబుతున్నారని పేర్కొన్నారు.
  • నెల్లూరులో నీటిపారుదల ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
  • అభివృద్ధికి త్యాగం చేసే రైతాంగానికి నష్టం చేస్తే చంద్రబాబు నాయుడుకి పతనం తప్పదని పేర్కొన్నారు.
  • నెల్లూరు జిల్లాలో మంచినీటి సమస్య ఉందని మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్నారని తెలిపారు.
  • వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 28 సంవత్సరాలు అయిందని ఇప్పటివరకు ఒక చొక్కా మంచినీళ్లు కూడా రాలేదని మండిపడ్డారు.
  • 2000 కోట్ల రూపాయలతో వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని దీనిని పూర్తి చేయలేని చవట ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని మండిపడ్డారు.  అందుకే వారు వాగ్దానాలను మాటలను నమ్మవద్దని పోరాటంతోనే ప్రజల కష్టాలు తీర్చేందుకు, హక్కులు రాబట్టుకోగలమని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై సిపిఎం పోరాటాలను ప్రజల ఆహ్వానించాలని, అందుకు కలిసికట్టుగా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 

➡️