కేశంపేట (రంగారెడ్డి) : కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో జరిగింది. షాద్‌నగర్‌కు చెందిన మల్లేశ్వరరావు కేశంపేట మండల పరిధిలోని వేమలనర్వలో ఉన్న తన పౌల్ట్రీ ఫామ్ వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా … ఇప్పలపల్లి గ్రామశివారులోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు వెంటనే చెరువు వద్దకు చేరుకొని మల్లేశ్వరరావును సురక్షితంగా బయటకు తీశారు. చెరువు లోతు తక్కువగా ఉండడంతో బాధితుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు.
