లోకేష్‌ను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు

Jun 10,2024 12:15 #Nara Lokesh, #TDP MLA

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని లోకేష్‌ నివాసంలో సోమవారం కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, బెందాళం అశోక్‌, వేగుల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అంగరపు రామ్మోహన్‌ తదితరులు లోకేష్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

➡️