ఆ సైకోని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి లోకేష్‌

అమరావతి : గౌతమిపై అత్యంత అమానవీయంగా వ్యవహరించిన సైకోని కఠినంగా శిక్షిస్తామని మంత్రి లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా హామీ ఇచ్చారు. శుక్రవారం అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ఉన్మాది యాసిడ్‌తో దాడి చేసిన ఘటనపై లోకేష్‌ స్పందించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన గౌతమి (23) పై యాసిడ్‌ దాడి ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసిందని లోకేష్‌ పేర్కొన్నారు. ఆ సోదరికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామన్నారు. గౌతమిపై అత్యంత అమానవీయంగా వ్యవహరించిన సైకోని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరో చెల్లిపై ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరుకున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.

➡️