ప్రజాశక్తి-అమరావతి : 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఈ రోజుతో ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి. 175 నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్‌లో ప్రజలు భారీగా తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో పోలింగ్ శాతం నమోదు అయింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 82 శాతం పోలింగ్ నమోదు అయింది. మరికాసేపట్లో విడుదల కానున్నాయి.
