ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్దన్‌రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ముందుస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నందున నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులకు పోలీసులు సమాచారమిచ్చారు. ఆయనపై యాంటిస్పెటరీ బెయిల్ పిటిషన్ ఇంకా కోర్టు పరిధిలో ఉంది.కాకాణిపై ఇప్పటికే క్వార్జ్ అక్రమ తరలింపు, ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదైంది.కాకాణి ఆచూకీ కోసం నెల్లూరు రూరల్ పోలీసులు గాలిస్తున్నారు.
