అమరావతి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయుగుండంగా మరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి మరియు కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.