ప్రజాశక్తి-విజయవాడ : ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని.. నిధులు కేటాయింపులు పెంచాలని కోరుతూ ఈ నెల 18న విజయవాడలో విజయవాడలో తలపెట్టిన రాష్ట్రస్థాయి ధర్నా చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏవి నాగేశ్వరరావు, నర్సింగరావు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వరలక్ష్మి దయా రమాదేవి యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నాగమణి ,కల్పన ,సుప్రజ పాల్గొన్నారు.
