ఎపి భవన్‌లో మహాత్మా గాంధీ జయంతి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో మహాత్మా గాంధీ 155వ జయంతి జరిగింది. బుధవారం నాడిక్కడ ఎపి భవ్‌లో బిఆర్‌ అంబేద్కర్‌ ఆడిటోరియంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను రెసిడెంట్‌ కమిషనర్‌ (ఆర్‌సి) లవ్‌ అగర్వాల్‌, అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ (ఎఆర్‌సి) హిమాంశు కౌశిక్‌ల ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌సి లవ్‌ అగర్వాల్‌ జ్యోతి ప్రజ్వలన చేసి, మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శాంతి, అహింస, సత్యాగ్రహం ఆచరించి, ప్రబోధించిన మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు.

టిడిపి కార్యాలయంలో ..
జాతిపిత మహ్మాతా గాంధీజీ, మాజీ ప్రధాన మంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతిని టిడిపి కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ పి అశోక్‌ బాబు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్య్రం కోసం గాంధీజీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమని నేతలు కొనియాడారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘వస్తున్నా- మీకోసం’ పాదయాత్ర 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన కేకును పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, అశోక్‌బాబు కట్‌ చేశారు.

➡️